కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు-18వ అధ్యాయము:మోక్షసన్న్యాసయోగం

అర్జున ఉవాచ సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ | త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన || 1 అర్జునుడు: కృష్ణా! సన్యాసం, త్యాగం—వీటి స్వరూపాలను విడివిడిగా తెలుసుకోదలచాను. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః | సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః || 2 శ్రీ భగవానుడు: ఫలాన్ని ఆశించి చేసేకర్మలను విడిచిపెట్టడమే సన్యాసమని కొంతమంది పండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలనూ వదలిపెట్టడమే త్యాగమని కొందరి అభిప్రాయం. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు-17వ అధ్యాయము: శ్రద్ధాత్రయ విభాగయోగము

అర్జున ఉవాచ యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః | తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః || 1 అర్జునుడు: కృష్ణా! శాస్త్రవిధులను విడిచిపెట్టినప్పటికీ శ్రద్ధతో పూజాదులు చేసేవాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది?సాత్వికమా? రాజసమా? తామసమా? శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా | సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు || 2 శ్రీ భగవానుడు: ప్రాణుల సహజసిద్ధమైనశ్రద్ధ సాత్వికమనీ, రాజసమనీ, తామసమనీ మూడువిధాలు. దానిని వివరిస్తాను …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు-16వ అధ్యాయము: దైవాసురసంపద్విభాగయోగము

శ్రీ భగవానువాచ అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః | దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ || 1 అహింసా సత్యమక్రోధః త్యాగః శాన్తిరపైశునమ్ | దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ || 2 తేజః క్షమా ధృతిః శౌచమ్ అద్రోహో నాతిమానితా | భవన్తి సంపదం దైవీమ్ అభిజాతస్య భారత || 3 శ్రీ భగవానుడు: అర్జునా! భయం లేకపోవడం, చిత్తశుద్ధి, జ్ఞానయోగనిష్ఠ, దానం, ఇంద్రియనిగ్రహం, యజ్ఞం, వేదపఠనం, తపస్సు, సరళస్వభావం, అహింస, సత్యం, కోపంలేకపోవడం, త్యాగబుద్ధి, …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు-15వ అధ్యాయము: పురుషోత్తమప్రాప్తియోగము

శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ | ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ || 1 శ్రీ భగవానుడు: వేదాలు ఆకులుగా వేళ్ళు పైకి, కొమ్మలు క్రిందకి వుండే సంసారమనే అశ్వత్థవృక్షం (రావి చెట్టు) నాశం లేనిదని చెబుతారు. ఇది తెలుసుకున్నవాడే వేదార్థం ఎరిగినవాడు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాళాః | అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే || 2 ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయసుఖాలే చిగుళ్ళుగా క్రిందకీ …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు-14వ అధ్యాయము: గుణత్రయవిభాగయోగం

శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ | యద్‌జ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిమితో గతాః || 1 శ్రీ భగవానుడు: జ్ఞానాలన్నిటిలోకీ ఉత్తమం, ఉత్కృష్టమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న మునులంతా సంసారవ్యథల నుంచి, బాధలనుంచి తప్పించుకుని మోక్షం పొందారు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః | సర్గే௨పి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ || 2 ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి నా స్వరూపం పొందిన వాళ్ళు …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు-13వ అధ్యాయము: క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగం

అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ | ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ || 1 అర్జునుడు: కేశవా! ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నా అభిలాష. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే | ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః || 2 శ్రీభగవానుడు: కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రమనీ, దీనిని తెలుసుకుంటున్నవాడే క్షేత్రజ్ఞుడనీ క్షేత్రక్షేత్రజ్ఞుల తత్వం …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు-12వ అధ్యాయము: భక్తియోగం

అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే | యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః || 1 అర్జునుడు: ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి నిన్ను భజించే భక్తులు ఉత్తములా ? ఇంద్రియాలకు గోచరించని ఆత్మ స్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా? శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే | శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః || 2 శ్రీ భగవానుడు: నా మీదే …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు-11వ అధ్యాయము: విశ్వరూపసందర్శనయోగం

అర్జున ఉవాచ: మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ | యత్త్వయోక్తం వచస్తేన మోహో௨యం విగతో మమ || 1 అర్జునుడు: నామీద దయతలచి అతి రహస్యమూ, ఆత్మజ్ఞాన సంబంధమూ అయిన విషయాలన్నిటినీ ఉపదేశించావు. దానితో నా అజ్ఞానమంతా అంతరించింది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా | త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ || 2 కృష్ణా! సమస్త భూతాల చావుపుట్టుకల గురించి అఖండమైన నీ మహాత్మ్యం గురించి నీ నుంచి వివరంగా విన్నాను. ఏవమేతద్యథాత్థ త్వమ్ …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు-10వ అధ్యాయము: విభూతియోగం

శ్రీ భగవానువాచ: భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః | యత్తే௨హం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా || 1 శ్రీభగవానుడు: నా మాటలు విని ఆనందిస్తున్నావు. కనుక నీ శ్రేయస్సుకోరి శ్రేష్ఠమైన వాక్యం మళ్ళీ చెబుతున్నాను విను. న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః | అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః || 2. దేవగణాలకుకాని, మహాఋషులకుకాని నా పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. దేవతలకూ, మహర్షులకూ అన్నివిధాల ఆదిపురుషుణ్ణి నేనేకావడం దీనికి …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 9వ అధ్యాయము:రాజవిద్యారాజగుహ్యయోగం

శ్రీ భగవానువాచ: ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే | జ్ఞానం విజ్ఞానసహితం యద్‌జ్ఞాత్వా మోక్ష్యసే௨శుభాత్ || 1 శ్రీ భగవానుడు: అశుభకరమైన సంసారబంధం నుంచి విముక్తి పొందడానికి తెలుసుకోవలసిన అతిరహస్యం, అనుభవసహితమూ అయిన జ్ఞానాన్ని అసూయలేని నీకు ఉపదేశిస్తున్నాను. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ | ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ || 2 విద్యలలో ఉత్తమం, పరమరహస్యం, పవిత్రమూ అయిన ఈ బ్రహ్మజ్ఞానం ప్రత్యక్షానుభవంవల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతం, శాశ్వతం సులభసాధ్యం. అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య …