కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 8వ అధ్యాయము: అక్షరపరబ్రహ్మయోగం

అర్జున ఉవాచ: కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ | అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే || 1 అర్జునుడు: పురుషోత్తమా ! బ్రహ్మమంటే ఏమిటి? అధ్యాత్మమంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతమూ, అధిదైవమూ అనేవి ఏవి? అధియజ్ఞః కథం కో௨త్ర దేహే௨స్మిన్ మధుసూదన | ప్రయాణకాలే చ కథం జ్ఞేయో௨సి నియతాత్మభిః || 2 మధుసూదనా ! ఈ శరీరంలో అధియజ్ఞుడెవడు; ఎలావుంటాడు? మనో నిగ్రహం కలవాళ్ళు మరణసమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు? …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 7వ అధ్యాయము: జ్ఞాన విజ్ఞాన యోగము

శ్రీ భగవానువాచ: మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః | అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు || 1 శ్రీ భగవానుడు: అర్జునా! మనస్సు నామీదే నిలిపి నన్నే ఆశ్రయించి, ధ్యానయోగాన్ని ఆచరిస్తూ సంశయం లేకుండా, సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను. జ్ఞానం తే௨హం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః | యద్‌జ్ఞాత్వా నేహ భూయో௨న్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే || 2 బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు (స్వానుభవంతో) సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 6వ అధ్యాయము: 6వ అధ్యాయము: ధ్యాన యోగము

శ్రీ భగవానువాచ: అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః | స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః || 1 శ్రీ భగవానుడు: కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించేవాడే నిజమైన సన్యాసి, యోగి అవుతాడు. అంతేకానీ అగ్నిహోత్రాది కర్మలు మానివేసినంతమాత్రాన కాడు. యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ | న హ్యసన్న్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన || 2 పాండునందనా ! సన్యాసమూ, కర్మయోగమూ ఒకటే అని తెలుసుకో. …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 5వ అధ్యాయము: కర్మ సన్యాస యోగము

అర్జున ఉవాచ: సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి | యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ || 1 అర్జునుడు: కృష్ణా! ఒకసారి కర్మ సన్యాసం చేయమనీ, మరోసారి కర్మయోగం ఆచరించమనీ ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది మంచిదో నాకు తేల్చి చెప్పు. శ్రీ భగవానువాచ: సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ | తయోస్తు కర్మసన్న్యాసాత్ కర్మయోగో విశిష్యతే || 2 శ్రీ భగవానుడు! కర్మత్యాగమూ, కర్మయోగమూ కూడా మోక్షం కలగజేస్తాయి. అయితే ఈ రెండింటిలో …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 4వ అధ్యాయము: జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము

ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ | వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే௨బ్రవీత్ || 1 శ్రీ భగవానుడు: వినాశనం లేని ఈ యోగం నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికీ బోధించారు. ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః | స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప || 2 అర్జునా! ఇలా సంప్రదాయ పరంపరగా వచ్చిన కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. అయితే అది ఈ లోకంలో క్రమేపి కాలగర్భంలో కలసిపోయింది. స …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 3 వ అధ్యాయము -కర్మయోగం-

జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన | తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ || 1 అర్జునుడు ఇలా పలికెను : ఓ జనార్దనా, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్ఠమైనదయితే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము అర్జునుడు: జనార్దనా ! కర్మకంటే …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-61 to 72

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః | వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||61 తాత్పర్యము ఇంద్రియ జయమువల్ల స్థితప్రజ్ఞత, స్థిత ప్రజ్ఞత వల్లనే ఇంద్రియజయము. ఇట్లు అన్యోన్యాశ్రయముచే మనస్సు దేనినీ సాధింపలేక పోవును. కనుక మనస్సు స్వాధీనపడుటకు మరొక సులభోపాయమును తెలిపెదను. ఇంద్రియానుభవము కంటే గొప్పది చూపిననే కద, మనస్సులో నిండిఉన్న విషయరాగం పోవును?. అట్టి గొప్పదగు ఆత్మను నీవు చూపలేవు. కావున, ఆత్మకంటే గొప్పవాడను, దివ్యుడను, ఆశ్రయించుటకు సులభుడను, (విగ్రహరూపంలో) …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-51 to 60

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః | జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్ఛం త్యనామయమ్ ||51 తాత్పర్యము సమత్వ బుద్ధియందు నిలచిన వివేకులు, ఆత్మజ్ఞానము కలిగియుండి తాము ఆచరించు కర్మల యొక్క ఫలములను కోరరు. కనుక ఆ కర్మలు వారిని బంధించవు. పైగా అవి వారి ప్రాచీన వాసనలను గూడ నశింపజేయును. అట్టి జ్ఞానులు నిరుపద్రవమగు మోక్షస్థానమునందుచున్నారు. ఇది ప్రసిద్ధము. యదా తే మోహకలిలం బుద్ధి ర్వ్యతి తరిష్యతి | తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-41 to 50

వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన! | బహుశాఖా హ్యనంతా శ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ||41 తాత్పర్యము హే అర్జునా! కర్మలనాచరించు జ్ఞానము రెండురకములగ ఉన్నది. ఆయా నిత్య నైమిత్తక, కామ్యకర్మలకు సంబంధించిన ఫలములను కోరి ఆచరించునది.అవి ఆచరిస్తే వచ్చే అవాంతర ఫలములు కోరక “సంసార బంధము తొలగి మోక్షసుఖమనుభవించుట మాత్రమే ” అనే ఒకే ఫలమును కోరి ఆచరించునది. ఈ రెండింటిలో మొదటి దానికంటే రెండవదే శ్రేష్ఠమైనది. మొదటిదానికి శరీరముకంటే ఆత్మ వేరని తేలిస్తే చాలు. ఆయా కర్మానుష్ఠానముతో …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-31 to40

స్వధర్మ మపి చావేక్ష్య న వికంపితు మర్హసి | ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే ||31 తాత్పర్యము అర్జునా! క్షత్రియునిగ దోషులను దండించుట నీ ధర్మము. ధర్మరక్షణకై యుద్ధము చేసి కొందరిని సంహరించినా అది నీకు పాపావహము కాదు. కర్తవ్యపాలనయే పుణ్యావహమగును. అట్టి యుద్ధము మానుట దోషమగును. కనుక స్వధర్మ పరిపాలన చేయుటలో చలించుట నీవంటివానికి తగదు. ఈ యుద్ధము న్యాయమును సంరక్షించుటకై ఎదురైన యుద్ధము. ఇది ధర్మ్యము, అనగ, ధర్మము నతిక్రమించనిది. క్షత్రియునకు …