యోత్స్యమానా నవేక్షేఽహం
య ఏతేఽత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః
యుద్ధే ప్రియచికీర్షవః ||23
సర్వాత్మనా అంధుని కుమారుడైన దుర్యోధనుడు పరమమూర్ఖుడు, అతనికి ఇష్టమైనట్లే యుద్ధము చేయగోరి, అతని పక్షమున వచ్చి నిలచినారు, భీష్మాది పెద్దలందరును. వారిలో ఎవరెవరితో ఎట్లు యుద్ధము చేయవలనో కూడా నేను ఆలోచించాలి. దానికి తగినట్లు రథమును నిలుపు కృష్ణా!
సంజయ ఉవాచ
ఏవముక్తో హృషీకేశో
గుడాకేశేన భారత! |
సేనయో రుభయో ర్మధ్యే
స్థాపయిత్వా రథోత్తమమ్ ||24
భరతవంశమునకు చెందిన ధృతరాష్ట్రా! నిద్రా బద్ధకములకు “గుడాక”ములని పేరు. వానిని జయించినవాడు అర్జునుడు కనుక అతనికి గుడాకేశుడని పేరు. సర్వుల ఇంద్రియముల ప్రవృత్తులను స్వాధీనమందు గలవాడు హృషీకేశుడు, శ్రీ కృష్ణుడు. అతడే అర్జునుని ఇంద్రియములను కూడా నియమించి, ఇంతవరకు యుద్ధము చేయు కోరికను పెంచెను. ఇక దానిని నియంత్రించి, అర్జునునిలో శోకము పొంగునట్లు ఇంద్రియములలో మార్పును చేసెను. అర్జునుని మాటలు వినిన శ్రీకృష్ణుడు ఇరుసేనల మధ్యగ రథమును నడిపి, అర్జునుని ఆజ్ఞను పరిపాలించెను.
కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది. భగవద్గీత ఈ యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
ఈ కథనం కేవలం ఒక చిన్న సారాంశం మాత్రమే. భగవద్గీతలో చాలా లోతైన తత్వాలు, సందేశాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని స్వయంగా చదవడం మరియు అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.