కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-31 to40

స్వధర్మ మపి చావేక్ష్య న వికంపితు మర్హసి | ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే ||31 తాత్పర్యము అర్జునా! క్షత్రియునిగ దోషులను దండించుట నీ ధర్మము. ధర్మరక్షణకై యుద్ధము చేసి కొందరిని సంహరించినా అది నీకు పాపావహము కాదు. కర్తవ్యపాలనయే పుణ్యావహమగును. అట్టి యుద్ధము మానుట దోషమగును. కనుక స్వధర్మ పరిపాలన చేయుటలో చలించుట నీవంటివానికి తగదు. ఈ యుద్ధము న్యాయమును సంరక్షించుటకై ఎదురైన యుద్ధము. ఇది ధర్మ్యము, అనగ, ధర్మము నతిక్రమించనిది. క్షత్రియునకు …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-21 to 30

వేదావినాశినం నిత్యం య ఏన మజ మవ్యయమ్ | కథం స పురుషః పార్థ! కం ఘాతయతి హంతి కమ్? ||21 తాత్పర్యము ధీమంతులు గల పృథువంశమున జన్మించిన అర్జునా! వివేకము కోల్పోకుము. ఆత్మలు నశించవని, త్రైకాలికా బాధ్యములని, జన్మాదులు లేనివగుటచే స్థిరరూపము కలవని ఎరింగిన వాడెవ్వడునూ ఆత్మలను ఏ శస్త్రాదులచేతనూ చంపించు ప్రయత్నము చేయడు. స్వయముగను ఆ యుద్ధాదులలో చంపు ప్రయత్నమునూ చేయడు. కనుక బుద్ధిమంతుడు చేయు యుద్ధాది క్రియలలో, ఆతడు చంపించునది చంపునది కూడ …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-11 to 20

శ్రీ భగవానువాచ అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే | గతాసూన్‌ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||11 తాత్పర్యము అర్జునా! దుఃఖిచదగని వాటిని గురించి ఇంతవరకు నీవెంత శోకించితివి? ఇచ్చట నిలచిన వీరులందరూ శరీరము, ఆత్మ అను రెండు కలిసియున్నవారు. నీకిది తెలిసియున్నచో, ఈ బంధువధ చేయుట ఎట్లు అని అడిగియుండవు. అయినా, శరీరముకంటే, ఆత్మ వేరని తెల్సినవాడు పలుకదగు, “నరకము పొందుట”,” పిండములను గైకొనుట”, “తర్పణములు స్వీకరించుట” మొదలగు గొప్ప వాదములు చేయుచున్నావు. శరీరము, ఆత్మ ఈ …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-1 to 10

భగవద్గీత – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-1 to 10 సంజయ ఉవాచ తం తథా కృపయాఽవిష్టం అశ్రుపూర్ణాకులేక్షణమ్ | విషీదంత మిదం వాక్యం ఉవాచ మధుసూదనః || 1 తాత్పర్యము ఏది తగునో, ఏది పుణ్యమో, ఏది పాపమో నిర్ణయించుకొనలేని స్థితిలోనున్న అర్జునునికి మనస్సంతా కరుణతోనిండిపోయెను. కనులు శోకాశ్రువులతో నిండెను. చూపులు జాలిగొలుపుచున్నట్లుండెను. శోకము పొంగి ప్రవహించున్నట్లుండెను, ఇది రజోగుణ ప్రభావము. మధువను రాక్షసుని సంహరించినట్లు, భక్తుల రజోగుణమును అణచివేయు శ్రీకృష్ణుడే మధుసూదనుడు. అర్జునునిలో కలిగిన రజఃప్రభావమును కూడ …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు -41,42,43,44,45,46,47

అధర్మాభిభవాత్ కృష్ణ! ప్రదుష్యంతి కులస్త్రియః | స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ! జాయతే వర్ణసంకరః ||41 దురాచారములు, వంశములలో చోటుచేసుకోగానే నిరాధారులగు స్త్రీలు చెడు అలవాట్లకు బానిసలగుదురు. స్త్రీలు నియమములు తప్పగనే జాతులన్నియు సాంకర్యమునందును. ఎప్పటినుండో వచ్చే వంశ నియమములు ఎన్నటికీ చెడరాదు. వృష్ణివంశమును ప్రకాశింప జేసిన వాడవు నీవు కద కృష్ణా! వంశాచారములను నశింపజేయు ఈ యుద్ధమును ఎట్లు చేయమందువు? సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ | పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియాః …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు -31,32,33,34,35,36,37,38,39,40

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ! | న చ శ్రేయోఽను పశ్యామి హత్వా స్వజన మాహవే ||31 కేశియను రాక్షసుని చంపి స్వజనమును కాపాడిన కేశవా! నాకిప్పుడీ సమయమున అన్నియు దుశ్శకునములే గోచరించుచున్నవి . స్వజనులను యుద్ధమందు చంపినందున నేను పొందు శ్రేయస్సేమిటో తెలియకున్నది. న కాంక్షే విజయం కృష్ణ! న చ రాజ్యం సుఖాని చ | కిం నో రాజ్యేన గోవింద! కిం భోగై ర్జీవితేన వా ||32 శ్రీకృష్ణా! నాకు బంధువధ …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు -25,26,27,28,29,30

భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ | ‘ఉవాచ పార్థ! పశ్యైతాన్ సమవేతాన్ కురూన్’ ఇతి ||25 సర్వలోకేశ్వరుడగు జగన్నాథుడు శ్రీకృష్ణుడు, అర్జునునికి సారథిగ అత్యంత సులభుడైపోయెను. అతడు చెప్పినట్లు చేసెను. లోకమంతా చూచెను. అయినా ఆ జగన్నాథుడు సిగ్గుపడనేలేదు. భీష్మ ద్రోణాదులే కాదు, సర్వదేశముల రాజులు చూచుచున్ననూ సిగ్గుపడుట లేదు. తనను నమ్ముకున్న వారికోసం తాను ఏమైనా చేయగలననే “ఆశ్రితవ్యామోహ”మనే గుణాన్ని ప్రకటించాలనుకున్నాడు. “అర్జునసారథి”, “పార్థసారథి” అనేదే ఓ బిరుదుగ చేసుకున్నాడు. తాను పార్థసారథియై రథమును …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు -23,24

యోత్స్యమానా నవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః | ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః ||23 సర్వాత్మనా అంధుని కుమారుడైన దుర్యోధనుడు పరమమూర్ఖుడు, అతనికి ఇష్టమైనట్లే యుద్ధము చేయగోరి, అతని పక్షమున వచ్చి నిలచినారు, భీష్మాది పెద్దలందరును. వారిలో ఎవరెవరితో ఎట్లు యుద్ధము చేయవలనో కూడా నేను ఆలోచించాలి. దానికి తగినట్లు రథమును నిలుపు కృష్ణా! సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత! | సేనయో రుభయో ర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||24 భరతవంశమునకు చెందిన ధృతరాష్ట్రా! …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు -22

యావ దేతాన్ నిరీక్షేఽహం యోద్ధు కామాన్ అవస్థితాన్ | కై ర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే || తాత్పర్యము శ్రీ కృష్ణా! యుద్ధము చేయగోరి ఇక్కడ చేరిన యోధులనందరను నేను చూడగల్గు చోటికి రథమును చేర్చి నిలుపుము. అంతే కాదు, నా సేనలో ఎవరెవరి సహాయమును తోడుకొని ఈ సంగ్రామమునొనరించవలెనో కూడా గమనింతును కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటంగా చిత్రీకరించబడింది. భగవద్గీత ఈ …

కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు -20,21

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః | ప్రవృత్తే శస్త్రసంపాతే ధను రుద్యమ్య పాండవః || 20 అర్జున ఉవాచ: హృషీకేశం తదా వాక్యం ఇద మాహ మహీపతే ! సేనయో రుభయో ర్మధ్యే రథం స్థాపయ మే௨చ్యుత ! 21 కురురాజా ! అప్పుడు అర్జునుడు యుద్ధసన్నద్ధులైన దుర్యోధనాదులను చూసి, గాండీవం ఎత్తిపట్టి శ్రీ కృష్ణుడితో ” అచ్యుతా ! రెండు సేనల మధ్య నా రథాన్ని నిలబెట్టు” అన్నాడు అర్జునుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు …